ప్రస్తుత డిజిటల్ ట్రెండ్‌లో... ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి తప్పనిసరైపోయింది. నచ్చిన ప్రతి దానిని ఫొటో తీయడం సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు, షేరింగ్‌లు అంటూ క్రేజీక్రేజీగా యువత తమ జీవనం సాగిస్తున్నారు. గురువారం జరిగిన ఖైరతాబాద్ ద్యాదశాధిత్య మహా గణపతి నిమజ్జన సందర్భంగా తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కొందరు ఆసక్తికరమైన కామెంట్లను పెడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు మహా గణపయ్యను తమ స్టాటస్ పెట్టుకోవాలనే తపనతో ఫొటోలు తీసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కరైనా స్మార్ట్ ఫోన్ లేకుండా కనిపించలేదు. గతంలో దేవుడ్ని చూడగానే రెండు చేతులెత్తి మొక్కేవాళ్లు... మరి ఇప్పుడు ఆ స్థానాన్ని స్మార్ట్ఫోన్లు ఆక్రమించాయి' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మొక్కేవారేరి.... అంతా 'క్లిక్కే' వారే! - Mokkevalleri? Everything 'clicks'!
చరవాణీలు నేటి జీవన విధానాన్ని ఎంతగా శాసిస్తున్నాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ చిత్రం కనపడుతోంది. గతంలో దేవుడ్ని చూస్తే చేతులెత్తి నమస్కారం చేసేవారు.. కానీ నేడు ఇది పూర్తిగా భిన్నంగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన సందర్భంగా తీసిన చిత్రం సంగతేంటో చూద్దామా!
మొక్కేవాళ్లేరి? అంతా 'క్లిక్కే' వారే!