Moinabad Woman Suicide Case Updates :హైదరాబాద్ మల్లేపల్లి చెందిన తహసీన్బేగంఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చేందుకు సీసీ కెమెరాలు దోహదం చేశాయిని మొయినాబాద్ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య తర్వాత మృతురాలు ఎవరో అంతుచికక్కపోవడం, సమీప ప్రాంతాల్లో ఎలాంటి ఆధారాలు లభ్యమవ్వకపోయినా మూడు రోజులు శ్రమించి అసలు వాస్తవాలను నిగ్గుతేల్చామని చెప్పారు. బలవన్మరణానికి పాల్పడ్డ యువతి బాకారం సమీపంలోని రిసార్ట్‌కు గతంలో వచ్చినట్లు వెల్లడించారు. ఆటో డ్రైవరు ఎక్కడికి వెళ్లాలని అడిగినప్పుడు తన ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌లో లోకేషన్ చూపించి అక్కడికి తీసుకెళ్లాలని సూచించినట్లు దర్యాప్తులో తేలింది. నిర్మానుష్య ప్రాంతం కావడం వల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Moinabad Woman Suicide CCTV Footage :మొయినాబాద్ బాకారం వద్ద ఈనెల 8వ తేదీన యువతి దహనం ఘటన వెలుగులోకి వచ్చాక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత దీన్ని హత్య కేసుగానే భావించి దర్యాప్తు మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 200 యువతుల మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించి ఘటనాస్థలిలో మృతురాలి వయసు, పోలికలు, లభ్యమైన కొన్ని వస్తువులు, ఇతర ఆధారాల సాయంతో కేసుల్ని పరిశీలించారు.
దీని ఆధారంగా సుమారు 20-25 ఏళ్ల మధ్య వయసున్న యువతుల అదృశ్యానికి సంబంధించి 60 కేసులు కొంత అనుమానాస్పదంగా అనిపించాయి. ఈ కేసుల్లో యువతుల ఫోటోలు, ఇతర ఆధారాలను తెప్పించుకున్నారు. ప్రత్యేక బృందాన్ని ఆయా పోలీస్‌స్టేషన్లకు పంపించి ఆరా తీశారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి వెంట ఉండే ఠాణాలు, మృతురాలి స్వస్థలం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంతో కేసు దర్యాప్తు సంక్లిష్టంగా మారింది.
జ్యోతిషం నమ్మొద్దన్నందుకు ఒకరు, చట్నీ ఎక్కువగా వేశావన్నందుకు మరొకరి ఆత్మహత్య