హైదరాబాద్ ఎంజేమార్కెట్ వద్ద కొనసాగుతున్న గణేశ్ శోభాయాత్రకు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఘనంగా స్వాగతం పలికారు. మనమందరం ఒకే సమాజానికి చెందిన వారమని చెప్పారు. మన బలం పేదవాడిని, సమాజాన్ని బాగు చేయడానికి వాడాలన్నారు.ప్రతి ఒక్కరూ గణేశునికి తొలి పూజ చేస్తారని తెలిపారు. ఆ గణేశుడు అందరి దోషాలు,తప్పులను తన బొజ్జలో దాచుకుంటాడన్నారు.వినాయకుడికి చాలా పెద్ద చెవులు ఉంటాయని భగవత్ అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. గణేశ్ ప్రతి ఒక్కరి మాట, ఆలోచన వినగలడని పేర్కొన్నారు. మంచి ఆలోచన చేసే వ్యక్తికి గణనాథుడు మంచి చేస్తాడని, గణనాథుడు అందరితో కలిసి నడుస్తాడని,నడిపిస్తాడని తెలిపారు. ఆరెస్సెస్ చీఫ్ రాకతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.
"మనదేశాన్ని ఆయుధాలతో, బుద్ధిబలంతో గెలవాలనుకున్నారు.. కానీ!" - MOHAN BHAGAVATH VISIT GANESH SHOBHA YATRA
మనదేశాన్ని ఎందరో ఆయుధాలతో గెలవాలనుకున్నారు... బుద్ధిబలంతో గెలవాలనుకున్నారు... కానీ అది సాధ్య పడలేదు. గణేశుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. - మోహనే భగవత్, ఆరెస్సెస్ చీఫ్
!["మనదేశాన్ని ఆయుధాలతో, బుద్ధిబలంతో గెలవాలనుకున్నారు.. కానీ!"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4416688-560-4416688-1568287597290.jpg)
మన బలం సమాజాన్ని బాగుచేయడానికి వాడాలి: మోహన్ భగవత్
ఇదీ చదవండిః ముంబయి లాల్బాగ్ గణేశ్ నిమజ్జనంలో కోలాహలం