హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ బ్రాంచ్ ఆఫీస్‌లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీలో బాబు మోహన్ సభ్యత్వం తీసుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ చేస్తోన్న సేవలను ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్‌ను విధిగా పాటించాలని ఆయన సూచించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని.. ఎవరూ బయటకు రాకూడదని అన్నారు. భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్ - హెల్త్ క్యాంప్‌లో భాగంగా మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌లో భాగంగా మాస్కులు, శానిటైజర్లను అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ పంపిణీ చేశారు. అనంతరం సొసైటీలో సభ్యత్వం తీసుకున్నారు.
రెడ్ క్రాాస్ సేవలు అమూల్యమైనవి : బాబు మోహన్
అనంతరం గాంధీ ఆసుపత్రిలో సుమారు 800 మందికి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి : కరోనాతో సహజీవనం: లాక్డౌన్ ఎత్తివేత దిశగా ప్రపంచం!