గ్రేటర్ పోరులో భాగంగా హైదరాబాద్ పాతబస్తీ మొగల్పుర డివిజన్లో భాజపా అభ్యర్థి చెర్మని మంజుల రూప్రాజ్ పాదయాత్ర నిర్వహించారు. డివిజన్లో ఉన్న సమస్యలను స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. తాను గెలిస్తే అన్ని విధాల అండగా ఉంటానని.. డివిజన్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజీ, రోడ్లు ఇతర సమస్యలు ఉన్నాయని మంజుల రూప్రాజ్ తెలిపారు.
భాజపాను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తా: మంజుల - telangana politics
తనను గెలిపిస్తే డివిజన్లోని అన్ని సమస్యలను పరిష్కారిస్తారని హైదరాబాద్ పాతబస్తీ మొగల్పుర డివిజన్ భాజపా అభ్యర్థి మంజుల రూప్రాజ్ తెలిపారు. ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
భాజపాను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తా: మంజుల
ఎన్నికల ప్రచారంలో యాకుత్పురా నియోజకవర్గం భాజపా ఇన్ఛార్జి రూప్ రాజ్, పాశం సురేందర్, కుమార్ పలువులు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి:జీహెచ్ఎంసీ బరిలో 1121 మంది అభ్యర్థులు