తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. తెరాస కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు.'ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు' అనే తెలుగు సామెతను ప్రస్తావిస్తూ ఎంఐఎంతో సావాసం చేయడం వల్ల తెరాస కూడా పాతబస్తీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాతబస్తీలో మెట్రో వేస్తామంటే మజ్లిస్ అడ్డుకుందని ఆరోపించారు.
'కారు' స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది: మోదీ - lb stadium campain'
మూసీకి ఒకవైపు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని తెరాసను ప్రధాని మోదీ విమర్శించారు. పాతబస్తీలో మెట్రో వేస్తామంటే మజ్లిస్ అడ్డుకుందని విమర్శించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు.
modi