తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈసారి మేయర్ పీఠం భాజపాదే: మోదీ - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020

హైదరాబాద్​ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం భాజపానే కైవసం చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లద్ మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన పట్ల ప్రజలు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు.

modi brother said this year mayor seat should be win bjp
ఈసారి మేయర్ పీఠం భాజపాదే: మోదీ

By

Published : Nov 27, 2020, 11:02 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లద్ మోదీ అన్నారు. గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో తిరుగుతూ... ఇక్కడి ప్రజలను కలుస్తున్నానని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల ఇక్కడి ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వ పాలన పట్ల రాష్ట్రంలో ప్రజలు నిరాశ చెందారని.. పాలనలో మార్పు కావాలని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ఈ ఎన్నికలో భాజపా అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ పాతబస్తి చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లద్ దర్శించుకున్నారు. ప్రతి ఏటా తాను అమ్మవారి ఆలయానికి వస్తున్నానని ఆయన వివరించారు.

ఈసారి మేయర్ పీఠం భాజపాదే: మోదీ

ఇదీ చూడండి :రేషన్​ డీలర్ల కమీషన్​ సరిపోవడం లేదు: మోదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details