ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని... దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు రాష్ట్ర భాజపా పిలుపునిచ్చింది. సేవా సప్తాహ పేరుతో ఈనెల 14 నుంచి 20 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ తెలిపారు. ఆస్పత్రులు, వెనుకబడిన తరగతుల వసతి గృహాలు, అనాధాశ్రమాల్లో ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల పంపిణీ, వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోదీ పిలుపు మేరకు ప్లాస్టిక్ వస్తువులు వాడబోమని, వర్షపు నీటిని పరిరక్షిస్తామని... స్కూళ్లలో, కాలేజీల్లో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు చెప్పారు.
సేవా సప్తాహ పేరుతో మోదీ పుట్టినరోజు వారోత్సవాలు - మోదీ
ప్రధాని మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని సేవా సప్తాహ పేరుతో వారం రోజుల పాటు... భాజపా సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తామని విద్యార్థులతో ప్రమాణం చేయించనున్నారు.
సేవా సప్తాహ పేరుతో మోదీ పుట్టినరోజు వారోత్సవాలు