పేదలకు ఉచితంగా క్యాన్సర్ వైద్యం అందించే విషయంలో ఎలాంటి కొత్త టెక్నాలజీనైనా అందిపుచ్చుకోవడం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికే దక్కిందని ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో హెడ్ అండ్ నెక్ రిహాబ్ క్లీనిక్‌ను ఆయన ప్రారంభించారు. స్వరపేటిక, నాలుకను కోల్పోయిన రోగులకు చికిత్స అనంతరం సాధారణ జీవితం గడిపేందుకు ఈ రిహాబిలిటేషన్ సెంటర్ సేవలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగులు... ఆనందంగా ఇంటికి వెళ్లేందుకు బసవతారకం ఆస్పత్రి కృషి చేస్తోందని బాలయ్య పేర్కొన్నారు.
క్యాన్సర్ చికిత్సకు ఆధునిక సాంకేతికత: బాలయ్య - BASAVATHARAKAM CANCER HOPSPITAL
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో బసవతారకం ఆస్పత్రి ముందుంటుందని ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ పేర్కొన్నారు. బసవతారకం ఆస్పత్రిలో హెడ్ అండ్ నెక్ రిహాబ్ క్లీనిక్‌ను ఆయన ప్రారంభించారు.
హెడ్ అండ్ నెక్ రిహాబ్ క్లీనిక్‌ను ప్రారంభించిన బాలకృష్ణ