తెలంగాణ

telangana

ETV Bharat / state

Weather Report: తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు - IMD weather report

ఆగ్నేయ బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు కూడా అదే ప్రదేశంలో కొనసాగుతుందని తెలిపింది.

IMD weather report
రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు

By

Published : Oct 30, 2021, 5:11 AM IST

Updated : Oct 30, 2021, 6:38 AM IST

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న ఆగ్నేయ బంగాళా ఖాతం పరిసర ప్రాంతాలలోని శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు అదే ప్రదేశంలో కొనసాగుతుందని ప్రకటించింది.

ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతోందన్నారు. ఇది రాగల 3 నుంచి 4 రోజులలో పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

నిన్న తూర్పు గాలుల్లో ఉన్న ఉపరితల ద్రోణి.. ఈ రోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వెల్లడించింది. ఈ రోజు కింది స్థాయి గాలులు ముఖ్యంగా ఈశాన్య దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:

RAIN ALERT: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో వర్షాలు

Last Updated : Oct 30, 2021, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details