రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, వడగళ్లతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఇందుకు అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది మరింత బలపడి క్రమంగా మే 6 వరకు ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది.
రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు - రాష్ట్రంలో వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు