కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. 7 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం జూన్ 5న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. 6వ తరగతి ప్రవేశాల కోసం జూన్ 6న పరీక్షలు జరగాల్సి ఉంది.
ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలు వాయిదా - ts model school entrance exams postponed
తెలంగాణలో ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా దృష్ట్యా ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఆదర్శ పాఠశాలల ప్రాజెక్టు డైరెక్టర్ వెల్లడించారు.

Model school entrance exams postponed
ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును సైతం జూన్ 20వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఆదర్శ పాఠశాలల ప్రాజెక్టు డైరెక్టర్ వెల్లడించారు.
ఇవీ చూడండి:కొవిడ్ టీకాల సరఫరాకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం