బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. ఇటీవల బంగాళాఖాతం నుంచి ఏపీలో తీరం దాటి తెలంగాణలో బీభత్సం సృష్టించిన తీవ్ర వాయుగుండం... గురువారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారి మహారాష్ట్రపై వ్యాపించి ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మహారాష్ట్ర నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించి ఈ నెల 19న మళ్లీ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని వెల్లడించారు. రాష్ట్రంలో నేడు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
ఈనెల 19న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈనెల 19వ తేదీన మళ్లీ తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయని... హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపై తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో నేడు, రేపు మేస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
ఈనెల 19న బంగాళాఖాతంలో అల్పపీడనం