తెలంగాణ

telangana

ETV Bharat / state

సంచార చేపల మార్కెట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి - హైదరాబాద్​లో సంచార చేపల మార్కెట్​ తాజా వార్త

గ్రేటర్​ పరిధిలోని సంచార చేపల మార్కెట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చేపట్టింది. మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్‌లెట్లకు సంబంధించి వాహనాలు కొనుగోలు చేసి డివిజన్​కి ఒక్కోటి చొప్పున నిరుద్యోగ మహిళలకు ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని పశుసంవర్ధక, మత్స్యశాఖ నిర్ణయించింది.

mobile fish markets in hyderabad
సంచార చేపల మార్కెట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

By

Published : Oct 29, 2020, 8:17 AM IST

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో సంచార చేపల మార్కెట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మత్స్య శాఖ ఆధ్వర్యంలో మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్‌లెట్లకు సంబంధించి వాహనాలు కొనుగోలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకం ప్రారంభించి అమలు చేసేందుకు పశుసంవర్థక, మత్స్య శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించి అవసరమైన నిధులు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ- ఎన్‌ఎఫ్‌డీబీ అందిస్తుంది.

మహిళలకే ప్రాధాన్యం..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 డివిజన్లలో ఒక్కొక్కటి చొప్పున సంచార విక్రయ కేంద్రాలు ప్రారంభించనున్న దృష్ట్యా... నిరుద్యోగ మహిళలకు అవి అప్పగించనున్నట్లు మత్స్య శాఖ తెలిపింది. నగరంలో సగటు మత్స్య వినియోగం పెంపొందించి ఆరోగ్యకరమైన వాతావరణం నడుమ చేపలు విక్రయించాలనేది లక్ష్యం. నీలి విప్లవం మార్గదర్శకాల్లో భాగంగా ఈ ప్రాజెక్టు కోసం రూ. 15 కోట్లు వెచ్చించనున్న ఎన్‌ఎఫ్‌డీబీ ఒక్కో యూనిట్‌కు రూ. 10 లక్షలు ఖర్చు చేయనుంది.

ఈ మేరకు తెలంగాణ మత్స్య శాఖ ప్రతిపాదనలను ఎన్‌ఎఫ్‌డీబీ అంగీకరించడం ద్వారా నిధులు విడుదలకు అంగీకరించింది. అర్హులైన లబ్ధిదారులైన మహిళల వాటా ధనం 40 శాతం భరిస్తే ఎన్‌ఎఫ్‌డీబీ 36 శాతం, కేంద్రం 24 శాతం మొత్తం 60 శాతం రాయితీగా ఇవ్వనుంది. సంచార చేపల విక్రయ కేంద్రాల కొనుగోలు కోసం ఈ నెల 20న మత్స్య శాఖ కమిషనర్, రాష్ట్ర వ్యవసాయ యంత్రాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది.

ఇదీ చూడండి:రాష్ట్రంలోని భూలావాదేవీల్లో నేటితో సరికొత్త అంకం

ABOUT THE AUTHOR

...view details