వాణిజ్య పన్నుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్, ఆందోళన చేపట్టారు. మొబైల్ అమ్మకాలపై కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ వ్యాట్ పునఃసమీక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద శాంతి యుతంగా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియషన్, తెలుగు సెల్యులార్ అసోసియేషన్, ట్విన్ సిటీ మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్లు ఈ ధర్నాలో పాల్గొన్నాయి. మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. మూడు సంస్థల ప్రతినిధులు చైతన్య దేవ్ సింగ్, వెంకట భాను, మాజిద్ బిన్ ఆబిద్ తదితర ప్రతినిధులు వాణిజ్య పన్ను శాఖ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ ధర్నా - ధర్నా
మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుత మార్గంలో నిరసన చేపట్టారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడాన్ని అరికట్టాలని జంట నగరాల కంప్యూటర్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది.
మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ ధర్నా
గత రెండేళ్లుగా వాణిజ్య పన్నులు అత్యధికంగా పెంచారని వారు ఆరోపించారు. ఈ విషయంపై అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించామని అయినా ఫలితం లేదని వారు వాపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొబైల్ అమ్మకాలకు 5% విధించారని, ప్రస్తుతం తెలంగాణలో 15 శాతానికి పెంచి వసూలు చేస్తున్నారన్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వానికి విన్నవించారు.
ఇదీ చూడండి : యాదాద్రి రహదారి విస్తరణ జరిగేనా...?