తెలంగాణ

telangana

ETV Bharat / state

సంతోషంగా క్రిస్​మస్  పండుగను జరుపుకోవాలి : తలసాని - హైదరాబాద్‌ వార్తలు

క్రిస్‌మస్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేదలకు ముఖ్యమంత్రి కానుకలను అందజేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. క్రైస్తవ సోదరులకు మంత్రి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

mnister-talasani-distributed-christmas-gifts-to-poor-people-in-secunderabad
పేదలు సంతోషంగా పండుగను జరుపుకోవాలి : తలసాని

By

Published : Dec 21, 2020, 12:14 PM IST

క్రైస్తవ సోదరులంతా ఆనందంగా క్రిస్‌మస్‌ వేడుకలను జరుపుకోవాలనే ఉద్దేశంతో కానుకలను పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్‌బోయగూడ ఫెలోనిమా చర్చి వద్ద పేద, మధ్య తరగతి కుటుంబాలకు పంపిణీ చేశారు.

కరోనా మహమ్మారి నుంచి క్రీస్తు లోకాన్ని రక్షించాలని... వైరస్ అంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం క్రైస్తవ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అన్నారు. వరదల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. క్రిస్‌మస్‌ సందర్భంగా క్రైస్తవ సోదరులకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చూడండి:రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు... వణుకుతోన్న భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details