ఎంఎంటీఎస్ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య
09:00 November 11
కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైల్
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు, స్టేషన్లో ఆగివున్న కర్నూలు ఇంటర్ సిటీఎక్స్‌ప్రెస్(హంద్రీ ఎక్స్‌ప్రెస్)ను ఢీ కొట్టింది. ఎంఎంటీఎస్ రైల్ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి.
ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక ట్రాక్‌పై రైలు నిలిచి ఉన్నప్పుడు మరో రైలుకు సిగ్నల్ ఎలా ఇస్తారని ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.