తెలంగాణ రాష్ట్ర అవతరణలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపించారు. తెరాస పాలనలో పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎదురుచూపులే మిగిలాయని ఎద్దేవా చేశారు. 63 శాతం ఫిట్మెంట్ పెంచాలని వారు కోరుతుంటే... 7.5 శాతం పెంచాలని ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వటంపై ఆయన మండిపడ్డారు.
'ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లకు భాజపా మద్దతు' - ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు ఎమ్మెల్సీ రామచందర్‌రావు మద్దతు
ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. వారి డిమాండ్లకు భాజపా మద్దతిస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు
ఈ సందర్భంగా 63 శాతం ఫిట్మెంట్ పెంచాలని సంఘాలు చేస్తున్న డిమాండ్‌కు భాజపా సంపూర్ణ మద్దతు ఉంటుందని రామచందర్ రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అద్దె ఇళ్లదారులకు ఉచిత నీరు.. లక్షలాది మందికి ప్రయోజనం