జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు నడిచే మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం తనను ఆహ్వానించకపోవడం పట్ల ఎమ్మెల్సీ రాంచందర్ రావు అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్సీని ఆహ్వానించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇది ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని... ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనను ఆహ్వానించలేదని ఆరోపించారు.
'కావాలనే నన్ను ప్రారంభోత్సవానికి పిలవలేదు' - మెట్రో ఆహ్వానం
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైల్ ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడం వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ రాంచందర్ రావు. ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

'కావాలనే నన్ను ప్రారంభోత్సవానికి పిలవలేదు'
ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్‌ను అనుసరించి ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించడం ప్రభుత్వం బాధ్యతని పేర్కొన్నారు. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Last Updated : Feb 7, 2020, 11:40 PM IST