తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు - సిద్దిపేట పోలీసులపై చర్యలు తీసుకోవాలి

దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం దారుణమని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్​ రావు విమర్శించారు. సిద్దిపేట పోలీసులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని...వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

MLC ramchander rao comments on  Siddipeta police actions on bandi sanjay  arres
పోలీసులపై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు

By

Published : Oct 27, 2020, 5:26 AM IST

సిద్దిపేటలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసులపై ఎన్నికల కమిషన్​ చర్యలు తీసుకోవాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్​రావు బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం దారుణమన్నారు. సిద్దిపేట పోలీసులు తెరాస కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికలో ప్రజలు తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అక్కసుతో ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు.

ఇదీ చూడండి:సిద్దిపేటలో పోలీసుల తీరు అప్రజాస్వామికం: కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details