విద్యార్థులకు పాఠశాల ప్రాంగణంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని ఎమ్మెల్సీ రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు.
ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్ రావు - రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతోందని ఎమ్మెల్సీ రాంచందర్ రావు మండిపడ్డారు. విద్యార్థులకు పాఠశాల ప్రాంగణంలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వానికి ప్రచారం తప్పితే విద్యార్థుల ప్రాణాలు లెక్క లేదని దుయ్యబట్టారు.
విద్యార్థులకు కరోనా వస్తుందనే పదో తరగతి పరీక్షలు రద్దు చేసిందన్న ఆయన ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులను కరోనాకు బలి చేయాలనుకుంటుదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రచారం తప్పితే విద్యార్థుల ప్రాణాలు లెక్క లేదని దుయ్యబట్టారు. విద్యాశాఖలో జీతాలు, బదిలీలు, ప్రమోషన్లు లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ లైన్ తరగతుల కోసం విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులకు మూడు నెలల జీతాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.