సికింద్రాబాద్ అడ్డగుట్ట వద్ద భాజపా నాయకులు సారంగపాణి ఆధ్వర్యంలో చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, భాజపా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేసి వారి సేవలను కొనియాడుతూ సన్మానించారు.
లాక్డౌన్ అమలులో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ రామచంద్రరావు - ఎమ్మెల్సీ రామచందర్రావు నిత్యావసరాల పంపిణీ
రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే లాక్డౌన్ ఎత్తి వేసినట్లుగా ఉందని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. సికింద్రాబాద్లోని నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
లాక్డౌన్ అమలులో ప్రభుత్వం విఫలమైంది: ఎమ్మెల్సీ రామచంద్రరావు
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరంలో పరిస్థితి సాధారణంగా మారిందని అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
TAGGED:
సికింద్రాబాద్ తాజా వార్త