రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను భాజపా అధ్యక్షులుగా తెరాస ఎమ్మెల్యే వ్యాఖ్యానించడాన్ని ఎమ్మెల్సీ రాంచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ఆయన అభిప్రాయమా లేక తెరాసదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో ఉన్న గవర్నర్‌ను ఎలా చూశారు.. ఈ గవర్నర్‌ను ఎలా చూస్తున్నారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్‌పై ఇలా ఆరోపణలు చేసే నవ్వుల పాలయ్యారని గుర్తు చేశారు. గవర్నరే కాదు హైకోర్టు సైతం ప్రభుత్వానికి చివాట్లు పెట్టిందని తెలిపారు.