పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక కసరత్తు చేపట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా వెబ్ కాస్టింగ్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అనేక పోలింగ్ కేంద్రాలను అనుసంధానిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.
పటిష్ఠ పర్యవేక్షణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు వెబ్కాస్టింగ్ని ఈసీ ఏర్పాటు చేసింది. అనేక పోలింగ్ కేంద్రాలను అనుసంధానిస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.
పటిష్ఠ పర్యవేక్షణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఓటింగ్ ప్రక్రియను లైవ్లో ఎప్పటికప్పుడు వీక్షించి... ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే స్పందించేందుకు ఈ వెబ్ కాస్టింగ్ దోహదపడనుంది.
ఇదీ చదవండి:'నేను కేసీఆర్ను కలవలేదు... తప్పుడు ప్రచారమన్న కోదండరాం'