తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీకి నామినేషన్లు - mohan reddy

కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ ముగ్గురు నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు.  అధికార పార్టీ.. పోటీ నుంచి విరమించుకునేలా చేసి ఏకగ్రీవం అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రిని గూడూరు నారాయణ రెడ్డి కోరారు.

ఎమ్మెల్సీకి నామినేషన్లు

By

Published : Mar 1, 2019, 12:01 AM IST

Updated : Mar 1, 2019, 5:14 PM IST

రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. 10 మందితో కూడిన సబ్ కమిటీ చర్చించి పంపిన జాబితాపై చర్చించిన ఏఐసీసీ ఈవేళ తుది నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నారాయణ రెడ్డి.. పట్టభద్రుల కోటాలో జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఉపాధ్యాయుల కోటా నుంచి తెరాస మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు.
ఏకగ్రీవం చేయండి
కేసీఆర్ పెద్ద మనసుతో తన ఎంపికకు సహకరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. తాను కూడా తెలంగాణ సాధన కోసం పనిచేశానని వెల్లడించారు. అధికార పార్టీ.. పోటీ నుంచి విరమించుకునేలా చేసి ఏకగ్రీవం అయ్యేట్లు చూడాలన్నారు.
ఐక్యతతోనే విజయం
శాసనమండలి పట్టభద్రుల స్థానానికి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో కాంగ్రెస్ ఐక్యతతోనే విజయం సాధిస్తామని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సమస్యలను పరిష్కరిస్తా
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తానని తెరాసమాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎమ్మెల్సీగా చేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు.ప్రైవేట్ ఉపాధ్యాయుల అభ్యర్థిగాషబ్బీర్ అలీ నామిషనేషన్ దాఖలు చేశారు.

ఇవీ చూడండి:ఐపీఎస్​ల బదిలీలు

ఎమ్మెల్సీకి నామినేషన్లు
Last Updated : Mar 1, 2019, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details