ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని దోమలగూడ యూటీఎఫ్ కార్యాలయంలో చేస్తున్న దీక్షకు పలు రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఆర్టీసీ సంస్థ ముగిసినట్లేనని సీఎం కేసీఆర్ ప్రకటించడం దుర్మార్గమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు తూతూమంత్రంగానే సాగాయని ఆరోపించారు. ప్రభుత్వం కార్మిక సంఘాలతో సంపూర్ణంగా చర్చలు జరిపి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష - కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరాహార దీక్
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మెకు మద్దతుగా పలువురు నేతలు నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హైదరాబాద్ యూటీఎఫ్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
MLC NARSIREDDY HUGER STRIKE FOR SUPPORTING TSRTC STRIKE IN HYDERABAD