కొవిడ్ చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలకే పరిమితం చేయటం అన్యాయమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. కొవిడ్ చికిత్సకు అనుమతించిన ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఉద్యోగులకు అయిన మొత్తం ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. గత విద్యా సంవత్సరం వృథా అయినందున విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని... ఈ విద్యా సంవత్సరం అలా జరగకుండా ముందస్తు ప్రణాళికతో విద్యాశాఖ వ్యవహరించాలని కోరారు.
MLC NARSIREDDY: విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడండి - తెలంగాణలో కరోనా చికిత్స వార్తలు
కరోనా చికిత్స ఖర్చులు పూర్తిగా రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం హామీ ఇచ్చినట్లుగా ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు.
విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడండి
ముఖ్యమంత్రి అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేసి 2 నెలలు గడుస్తున్నా... రిటైర్మెంట్ వయసు పెంపు మినహా ఇతర ఉత్తర్వులు విడుదల కాకపోవటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ ప్రకటించాలన్నారు. కేజీబీవీ, కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ