కొవిడ్ రెండో దశను నియంత్రించడంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండిపడ్డారు. వ్యాక్సిన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తొలగించి.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, గోల్కొండలోని సీఐటీయూ కార్యాలయంలో.. కొవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక ప్రతినిధులు చేపట్టిన నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.
'కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి' - ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్
కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్, గోల్కొండలోని సీఐటీయూ కార్యాలయంలో.. కొవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక ప్రతినిధులు చేపట్టిన నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.
ఆరోగ్యశ్రీలో కరోనా
కేంద్రం.. వ్యాక్సిన్ పంపిణీ, వైరస్ కట్టడి విషయంలో స్పష్టమైన విధానాన్ని అవలంభించని కారణంగానే రెండో దశ విజృభిస్తోందని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షురాలు అరుణ జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు.. రెండో డోసు కోసం అవస్థలు పతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు తక్షణమే బడ్జెట్ను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:వైద్యం ఖర్చులు భరించలేక.. కరోనా బాధితుని బలవన్మరణం