ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈనెల 13 న తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. పీఆర్సీ అమలు, సీసీఎస్ రద్దు చేయాలని.. ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.
'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి వీడాలి' - hyderabad latest news
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ హైదరాబాద్ ధర్నాచౌక్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
'ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యవైఖరి వీడాలి'
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్లేని తెలంగాణ సాధించుకుందామని ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాని ఆయన నిలదీశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.