ఉద్యోగ, ఉపాధ్యాయు, పింఛనుదారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పీఆర్సీను వెంటనే అమలుచేయాలని కోరారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 4, 5 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల వయోపరిమితి 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు. సర్వీసు ప్రకారం పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
4, 5 తేదీల్లో నిరాహార దీక్ష: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి - TELANGANA PRC NEWS
ఈనెల 4.5 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తానని చెప్పారు.
సమస్యల పరిష్కారానికే నిరాహార దీక్ష: నర్సిరెడ్డి