Mlc Kavitha Tweet: ఎన్నికల్లో తాను ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను రాహుల్‌గాంధీలా నియోజకవర్గాన్ని వదిలి పారిపోలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్, తెరాస నాయకుల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఈ సందర్భంగా తనపై ట్వీట్ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న దురహంకారం వల్లే పార్టీ రెండంకెల సీట్లకు చేరుకుందని ఎత్తిచూపారు. ఎన్నికల్లో రాహుల్‌గాంధీ మాదిరిగా తాను రెండు స్థానాల నుంచి పోటీ చేయలేదని కూడా చెప్పారు.
'ఒక దేశం- ఒకే సేకరణ విధానం' అని తెరాస డిమాండ్ చేస్తున్నట్లు కవిత వివరించారు. దీనిపై రాహుల్‌గాంధీ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. తెరాస ఎల్లప్పుడు రైతులతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వరిని సేకరించే వరకు విశ్రమించేది లేదని తెలిపారు.