MLC Kavitha tweet on Ayodhya Ram Mandir : అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నాయని కవిత హర్షం వ్యక్తం చేశారు.
బస్సులో మహిళకు టికెట్‌పై చార్జీ - తర్వాత ఏమైందంటే?
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాములవారిని ప్రతిష్టించే గర్భగుడి ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామమందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను ఆమె ట్వీట్ చేశారు.
MLC Kavitha Latest News :అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభసమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అని ఆమె పేర్కొన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.
ప్రోటోకాల్ వివాదం - స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానన్న సునీత లక్ష్మారెడ్డి
ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లు ముమ్మరం :మరోవైపు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వేడుకలను నాలుగు దశలల్లో నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే ఆహ్వానం అందింది. అయితే ఈ వేడుక కోసం దేశ, విదేశాల్లోని 10 కోట్లకుపైగా కుటుంబాలను ఆహ్వానించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.
అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రారంభమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోసం పోస్టల్ శాఖ సాయంతో ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు వేల మంది సాధువులకు ఈ లేఖలను పంపింది. ఈ పత్రికలు అందుకున్న సాధువులు.. ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం తమకు లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భారత తపాలా శాఖ సహకారంతో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు.
'అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు దేశవ్యాప్తంగా సెలవు'- గర్భగుడి ఫొటో చూశారా?