తెలంగాణ

telangana

ETV Bharat / state

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం: ఎమ్మెల్సీ కవిత - mlc kavitha latest news

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెచ్చిన తెలంగాణ పారిశ్రామిక విధానం, టీఎస్‌-ఐపాస్‌ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యుత్తమైనవిగా గుర్తింపు పొందాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామంలా నిలుస్తోందని కొనియాడారు. ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

By

Published : Jun 5, 2021, 8:01 AM IST

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ పేరొందిన సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని తెలిపారు. చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ సారా కిర్లూ శుక్రవారం దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని కవిత వివరించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెచ్చిన తెలంగాణ పారిశ్రామిక విధానం, టీఎస్‌-ఐపాస్‌ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యుత్తమైనవిగా గుర్తింపు పొందాయని.. అద్భుత ఫలితాలను సాధించాయని తెలిపారు. సత్వర అనుమతులకు తోడు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:మార్క్‌ఫెడ్‌ అడగదు.. ప్రభుత్వం చెప్పదు.!

ABOUT THE AUTHOR

...view details