ఆటలో గెలుపు, ఓటములు భాగమని ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) అన్నారు. క్రీడాకారులు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ జాతీయ సబ్ జూనియర్స్ బాలుర టోర్నమెంట్ నిర్వహించగా... ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈనెల ఏడో తారీఖున ప్రారంభమైన టోర్నమెంట్... ఆదివారం ముగిసింది. విజేతగా నిలిచిన తెలంగాణ జట్టుకు ఆమె అభినందనలు తెలిపారు. జాతీయ సబ్ జూనియర్స్ బాలుర టోర్నమెంట్లో మొదటి విజేత తెలంగాణ కాగా... రెండో స్థానంలో రాజస్థాన్ నిలిచింది. విజేతలకు బహుమతులు అందజేశారు
mlc kavitha: 'ఆటలో గెలుపు, ఓటములు భాగం.. ధైర్యంగా ముందుకు సాగాలి'
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ జాతీయ సబ్ జూనియర్స్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత(mlc kavitha) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన తెలంగాణ, రాజస్థాన్ జట్లకు ట్రోఫీ అందజేశారు.
ఈ పోటీల్లో 26 రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. తదుపరి పోటీల్లో టైటిల్ గెలవడానికి ప్రయత్నించాలని మిగతా జట్లకు కవిత సూచించారు. 29-26 స్కోర్‌తో రాజస్థాన్‌పై థ్రిల్లర్ విజయంతో తెలంగాణ జట్టు ట్రోఫీని గెలుచుకుంది హైదరాబాద్‌లో జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, శ్రీనివాసరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, ఆనందీశ్వర్ పాండే, తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Basra IIIT Students: చదువుల పూదోటలో గుబాళించిన గ్రామీణం