Kavitha Tweet On Governor Tamilisai Speech: ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌ను ప్రతిధ్వనించేలా గవర్నర్ తమిళిసై మాట్లాడారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గవర్నర్ తమిళిసై ప్రసంగంలోని కొంత భాగాన్ని ట్వీట్ చేసి.. తన వ్యాఖ్యలను జోడించారు. తాము పోరాడుతున్నది కూడా.. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే పెట్టకుండా.. రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతపై దృష్టి పెట్టాలనేనని అన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా కన్నా.. దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని తాము డిమాండ్ చేశామని కవిత పేర్కొన్నారు.
కేసీఆర్ విజన్‌ను ప్రతిబింబించేలా ప్రసంగించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలంటూ కవిత ట్వీట్ చేశారు. దేశంలో భిన్నత్వాన్ని రాజ్యాంగం ప్రతిబింబిస్తోందని మరో ట్వీట్‌లో కవిత పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రతీ అంశాన్ని బలపరచడం భారతీయులందరి బాధ్యత అన్నారు. ఇదిలా ఉంటే రాజ్‌భవన్‌కు, సీఎం కార్యాలయానికి మధ్య దూరం బాగా పెరుగుతూ వస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించకూడదని ప్రభుత్వం భావించిన, కోర్టు అందుకు భిన్నంగా తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో సమస్యలను చూపిస్తూ.. రాజ్‌భవన్‌లోనే పరేడ్ ఏర్పాటు చేసింది.
రెండేళ్లుగా రాజ్‌భవన్, సీఎం కార్యాలయం మధ్య దూరం: గత రెండేళ్లుగా రాజ్‌భవన్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య దూరం పెరుగుతూ రాగా, కొన్ని నెలలుగా తీవ్రమైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం, మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం, ఎమ్మెల్సీల నియామకంలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసి పంపిన పేర్లపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఎక్కువ రోజులు పెండింగ్‌లో పెట్టడం, గవర్నర్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లినపుడు ప్రభుత్వపరంగా ప్రోటోకాల్ ఏర్పాటు చేయకపోవడం.. వంటివి ఒకదానికొకటి తోడై.. విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.
చాలాకాలం తర్వాత ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు స్వాగత కార్యకమ్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై కలిసి పాల్గొన్నారు. ఇటీవల కాలంలో తరచూ గవర్నర్ రాష్ట్రప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర వేడుకలు మరోసారి వివాదానికి తెరలేపాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌లోనే ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పది రోజుల కిందటే గవర్నర్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. ఖమ్మంలో అయిదు లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తే లేని కొవిడ్.. పరేడ్ గ్రౌండ్‌లో రిప్లబిక్‌డే వేడుకలకు వస్తుందా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: