ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లిన కవిత.. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో నోటీసులు అందుకున్న సమయంలోనూ కవిత సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం విదితమే.
ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. సీఎంతో భేటీ.. - mlc kavitha met cm kcr at pragati bhavan
ఎమ్మెల్సీ కవిత
17:03 December 21
ప్రగతిభవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. సీఎంతో భేటీ..
అయితే ఈడీ, సీబీఐ కేసులు డైలీ సీరియల్ లాంటివని తన నివాసం నుంచి ప్రగతిభవన్‌కు బయల్దేరిన సమయంలో కవిత వ్యాఖ్యానించారు. రేపు నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న కవిత.. తాజా పరిణామాలపై అక్కడే స్పందిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి..
Last Updated : Dec 21, 2022, 6:26 PM IST