తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతిభవన్​కు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సీఎంతో చర్చ..! - సీఎం కేసీఆర్​తో ఎమ్మెల్సీ కవిత భేటీ

ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్​కు వెళ్లారు. కవితకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో తెరాస కార్యకర్తలు సీఎం కేసీఆర్​ ఇంటివద్దకు చేరుకున్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నోటీసులపై కవిత కేసీఆర్​తో చర్చించే అవకాశం ఉంది.

ప్రగతిభవన్​కు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సీఎంతో చర్చ..!
ప్రగతిభవన్​కు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నోటీసులపై సీఎంతో చర్చ..!

By

Published : Dec 3, 2022, 11:46 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు శుక్రవారం సీబీఐ నోటీసులు ఇచ్చింది. 160 సీఆర్​పీసీ కింద నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ నెల 6న విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కానీ, దిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి’’ అని నోటీసుల్లో పేర్కొంది.

ఈ నేపథ్యంలో కవిత ప్రగతిభవన్​కు వెళ్లారు. ఆమెకు సంఘీభావంగా పెద్దఎత్తున తెరాస కార్యకర్తలు ముఖ్యమంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. సీబీఐ ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్​తో కవిత చర్చించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details