తెలంగాణ

telangana

ETV Bharat / state

అది కేంద్రం వైఫల్యమే... రాష్ట్ర ప్రభుత్వానిది కాదు: కవిత - జీహెచ్‌ఎంసీ ఎన్నికల తాజా వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎన్నికలప్పుడు తప్పా... అభివృద్ధి కోసం భాజపా ఏనాడూ ముందుకు రాలేదని ఆరోపించారు. హైదరాబాద్‌ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. నిరంతరం ప్రజల పక్షాన ఉండే తెరాసకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

mlc-kavitha-demand-bharat-ratna-to-pv-and-ntr
అది కేంద్రం వైఫల్యమే... రాష్ట్ర ప్రభుత్వానిది కాదు: ఎమ్మెల్సీ కవిత

By

Published : Nov 26, 2020, 3:01 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ పేర్లు చెప్పి పబ్బం గడపాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాజకీయ నాయకుల ఈ వికృత చేష్టలు గమనించి... హైదరాబాద్ ప్రజలు లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. పీవీకి, ఎన్టీఆర్‌కి తక్షణమే భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.

భాజపా ఎన్నికల మూడ్ లో తప్ప, అభివృద్ధి అజెండాతో ఎప్పుడూ ఉండదని కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లో అక్రమంగా విదేశీయులు ఉంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే తప్ప, రాష్ట్ర ప్రభుత్వానిది కాదన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు కేంద్రం రూ.1350 కోట్ల వరద సాయం ప్రకటించాలని ఆమె కోరారు. నిరంతరం ప్రజల కోసం పాటు పడే తెరాసకే ఓటు వేయాలని ఆమె అభ్యర్థించారు.

అది కేంద్రం వైఫల్యమే... రాష్ట్ర ప్రభుత్వానిది కాదు: ఎమ్మెల్సీ కవిత

ఇదీ చదవండి:ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ.. ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details