తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు జంతర్‌మంతర్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష - latest news on mahila regervation

MLC Kavitha Deeksha in Delhi Today: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు. బిల్లును ఇప్పటికైనా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగానే ఇవాళ దిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు కాంగ్రెస్‌ సహా 18 పార్టీల ప్రతినిధులను ఆహ్వానించినట్లు కవిత తెలిపారు.

BRS MLC KAVITHA
బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత

By

Published : Mar 10, 2023, 7:31 AM IST

MLC Kavitha Deeksha in Delhi Today: మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలోని భారత్‌జాగృతి ప్రతినిధులు దిల్లీ జంతర్‌మంతర్‌లో ఇవాళ దీక్షచేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే దిల్లీ చేరుకున్న కవిత ఈ కార్యక్రమానికి 29 రాష్ట్రాల్లోని మహిళా సంఘాలను ఆహ్వానించినట్లు తెలిపారు. 6 వేలమందికి పైగా వస్తారని అంచనా వేశామని 18 పార్టీలు ప్రతినిధులను పంపేందుకు అంగీకరించినట్లు కవిత చెప్పారు. కాంగ్రెస్‌ ప్రతినిధులను పంపాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కోరామని తెలిపారు.

MLC Kavitha Deeksha at Janta Mantar Today : సోనియాగాంధీకి ఆహ్వానం పంపారా అన్న ప్రశ్నకు.. ఆమె చాలాపెద్ద నాయకురాలని, తాను చిన్న ఎమ్మెల్సీనని, ఒకసారి ఎంపీని మాత్రమేనని కవిత బదులిచ్చారు. దీక్షకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు సమాచారమివ్వగా వెళ్లి కవిత వారితో మాట్లాడారు. అనంతరం దీక్షకి దిల్లీ వెస్ట్‌జోన్‌ డీసీపీ మౌఖికంగా సగం ప్రదేశంలో చేసుకోమని అనుమతిచ్చారు. దీక్షా ఏర్పాట్ల పరిశీలించిన ఆమె ఒకరోజు ముందు సగం ప్రాంతంలో ఏర్పాట్లుచేసుకోవాలని చెప్పడం బావ్యం కాదన్నారు. ఐతే జాగృతి ప్రతినిధులు 6 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లుచేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుందని చెప్పారు.

సీపీఎం ప్రధానకార్యాలయానికి వెళ్లిన కవిత... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి దీక్షకు రావాలని ఆహ్వానించారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారని ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రధాని బిల్లు ఆమోదానికి ప్రయత్నించారని తెలిపారు. పూర్తి మెజార్టీ ఉండి ఎలాంటి చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.

గతంలో బిల్లును వ్యతిరేకరించిన సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుతం మద్దతిస్తోందని కవిత గుర్తుచేశారు. మహిళలపై దౌర్జన్యాలు వంటి అంశాలపై హైదరాబాద్‌లో బీజేపీ ధర్నా చేపట్టనుండటాన్ని కవిత స్వాగతించారు. ఆ రకంగానైనా బీజేపీ నేతలకు మహిళలు గుర్తుకురావడం సంతోషమని, తన దీక్ష విజయవంతమైనట్లేనని కవిత వ్యాఖ్యానించారు. ఈడీ విచారణ తదితర అంశాల్లో అవసరమైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.

దిల్లీ మద్యంకేసులో నిందితులను అరెస్టుచేయడంతో పాటు పూర్తి వివరాలు త్వరగా వెలికితీయాలని దిల్లీలో బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆ పార్టీ కార్యక్రమాన్ని తొలుత జంతర్‌మంతర్‌లోనే చేయాలనుకున్నారు. కవిత నేతృత్వంలో అక్కడే దీక్ష నిర్వహిస్తుండడంతో ఉద్రిక్తతలు తలెత్తుతాయని భావించిన పోలీసులు బీజేపీ ఆందోళనను దీన్‌దయాళ్‌ మార్గ్‌కు మార్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details