తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్​ .. ప్రతిపక్షాల ట్వీట్ వార్​కు కవిత స్ట్రాంగ్ కౌంటర్​ - Kavitha counter tweet to Manickam Tagore

Kavtiha Counter To Opposition Parties tweets : దిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టు చేసిన సమీర్‌ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3,000 పేజీల ఛార్జిషీట్‌లో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవితను ఉద్దేశిస్తూ లిక్కర్ క్వీన్ అని చేసిన ట్వీట్​ చేయగా.. కవిత చాలా వివరణలు ఇవ్వాల్సి ఉందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మణిక్కం ఠాగూర్ ట్వీటారు. ఇలా ప్రతిపక్షాలు తనపై జరుపుతోన్న ట్వీట్ వార్​కు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Kavtiha counter to Rajagopal reddy
Kavtiha counter to Rajagopal reddy

By

Published : Dec 21, 2022, 11:28 AM IST

Updated : Dec 21, 2022, 12:05 PM IST

Kavtiha Counter To Opposition Parties tweet: దిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్​లో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈడీ ఛార్జిషీట్​లో లిక్కర్ క్వీన్(లిక్కర్ రాణి) పేరును ఈడీ 28 సార్లు ప్రస్తావించింది అంటూ ట్వీట్ చేశారు. మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మణిక్కం ఠాగూర్ కూడా స్పందిస్తూ.. కవిత చాలా వివరణలు ఇవ్వాల్సి ఉందంటూ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలు తనపై చేస్తోన్న ట్వీట్ల దాడికి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

Kavitha counter tweet to Rajagopal reddy:రాజగోపాల్ అన్నా తొందర పడకు.. మాట జారకు అంటూ కవిత హితవు పలికారు. తన పేరు ఎన్నిసార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదంటూ ట్వీట్ చేశారు. 28 సార్లు కాదు 28 వేల సార్లు చెప్పించినా గెలిచేది నిజమేనని కవిత వ్యాఖ్యానించారు.

Kavitha counter tweet to Manickam Tagore: తనపై వచ్చిన నిందలన్నీ బోగస్ అని, తప్పని కవిత తోసిపుట్టారు. కవిత చాలా వివరణలు ఇవ్వాల్సి ఉందంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మణిక్కం ఠాగూర్ చేసిన ట్వీట్​పై ఆమె స్పందించారు. తనపై వచ్చిన నిందలన్నీ బోగస్, అవాస్తవమన్న కవిత.. తన నిబద్ధతను కాలమే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్.. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలను ఎండగడుతున్నందుకే మా నాయకులను భయపెట్టాలని సూచిస్తున్నారని ట్విట్టర్ వేధికగా వెల్లడించారు.

అసలేం జరిగిందంటే.. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసిన సమీర్‌ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3,000 పేజీల ఛార్జిషీట్‌లో ఈడీ ఎమ్మెల్సీ కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ్‌ రెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లైల పేర్లు ప్రముఖంగా ప్రస్తావించింది. రూ.10,000 కోట్ల ఆదాయం ఉన్న మద్యం వ్యాపారాన్ని చేజిక్కుంచుకోవడం కోసం రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఛార్ఙిషీట్‌లో పేర్కొంది. గత నెల 26న దాఖలు చేసిన 3,000పేజీల ఛార్జిషీట్​లో పొందుపరిచిన వివరాలతో కూడిని ప్రాసిక్యూషన్‌ కంప్లైంట్‌ కాపీని కోర్టుకు అందించింది. ఇది తాజాగా బయటికి రావడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details