MLC Kavitha Comments On Smriti Irani Decision on Menstrual Leave :నెలసరి సమయంలో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేందుకు తెచ్చిన ప్రతిపాదనను కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కనికరం లేకుండా తిరస్కరించడం నిరుత్సాహపరిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒక స్త్రీగా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికావని, నెలసరి సమయంలో మహిళ పడే బాధను ఒక మహిళే అర్థం చేసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు.
'నెలకు నాలుగు రోజుల పీరియడ్ లీవ్స్పై స్పందించండి'
నెలసరి అనేది ఒక బయాలాజికల్ చర్య, వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించినట్లేనని కవిత పేర్కొన్నారు. నెలసరి వైకల్యం కాదని, అదొక సహజ ప్రక్రియే అయినప్పటికీ ఆ సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు మంజూరు చేయాలని కోరాల్సింది పోయి, ఆ విషయాన్ని కొట్టిపారేయడం సరికాదని కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.
'ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి సెలవులు!'.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Smriti Irani Opposes Paid Menstrual Leaves Policy : మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మహిళా, సంక్షేమ శాఖ మంత్రిస్మృతీ ఇరానీవ్యతిరేకించారు. రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానం ఇచ్చారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదన్న ఆమె అది జీవితంలో అదొక సహజ ప్రక్రియ అన్నారు. ఈ నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షతకు దారితీయొచ్చని వెల్లడించారు. అలాకే నెలసరి సమయంలో మహిళలు పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.