తెలంగాణ

telangana

ETV Bharat / state

Kavitha On LPG Cylinder Price: 'ధరలు పెంచి సామాన్యులకు ఏం సందేశమిస్తున్నారు' - Mlc Kavitha News

Kavitha On LPG Cylinder Price: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెంచడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kavitha
Kavitha

By

Published : May 1, 2022, 5:21 PM IST

Kavitha On LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్న ఆమె... సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 102 పెంచడం ఎన్నికల తర్వాత అతి పెద్ద ధరల పెంపుగా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రజలు దుకాణాలకు సైతం వెళ్లేందుకు భయపడేలా నిత్యావసరాల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. సిలిండర్, పెట్రోల్, డీజిల్​పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, సామాన్యులపై భారం మోపుతోందని ధ్వజమెత్తారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై ఆర్థిక భారం పెంచుతుందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? ఎన్నికల తర్వాత అతిపెద్ద ధరల పెంపుదల ఇదే.

ABOUT THE AUTHOR

...view details