తెలంగాణ

telangana

ETV Bharat / state

MLC Kavitha On Assam CM: అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ కవిత - హైదరాబాద్​ వార్తలు

MLC Kavitha Comments On Assam CM: తెరాస పాలనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన కవిత.... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి భాజపా ఎందుకు ప్రయత్నిస్తోందో అర్థం కావటం లేదన్నారు.

MLC Kavitha
MLC Kavitha

By

Published : Jan 9, 2022, 5:43 PM IST

MLC Kavitha Comments On Assam CM : తెరాస పాలనపై అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తుడిచిపెట్టడానికి భాజపా ఎందుకు ప్రయత్నిస్తోందని.. ట్విట్టర్​ వేదికగా విమర్శించారు. 2018 ఎన్నికల సమయంలో భాజపా 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు.

తెలంగాణలో ఇప్పటికే లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించి తెలంగాణ... దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని గతంలో చెప్పిన భాజపా... ఇన్నేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో దాదాపు 8 శాతానికి పెరిగిందన్న కవిత... సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన... రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలను భాజపా పాలిత ప్రాంతాల్లోనూ పేర్లు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చూడండి:Sitaram Yechury: 'ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎన్నికల తర్వాతే ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details