తెలంగాణ

telangana

ETV Bharat / state

వెంకన్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత - mlc kavitha visited lord venkateswara bramshotsavas

హైదరాబాద్​లో జూబ్లీహిల్స్​ కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో తెరాస ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

mlc kavitha attended jubli hills venkateswara swamy brahmotsavam
వెంకన్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత

By

Published : Mar 19, 2021, 4:12 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వరస్వామితో పాటు దత్తాత్రేయ స్వామికి మొక్కులు చెల్లించారు.

వెంకన్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత
వెంకన్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత

కవిత వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. దర్శనం అనంతరం వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ ఉత్సవాలు ఈనెల 21వరకు సాగనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details