కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు కార్యాలయాలు లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో అన్నారు. ఎంపీటీసీలకు గ్రామ పంచాయతీల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని పేర్కొన్నారు. ఎంపీటీసీలకు తగిన ప్రాముఖ్యత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థలకు15వ ఆర్థిక సంఘం రూ.500 కోట్లు లోటు పెట్టినా...స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 500 కోట్లు అదనంగా ఇచ్చారని ఆమె వివరించారు. అయినా క్షేత్ర స్థాయిలో ఉన్న లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నట్లు మండలిలో పేర్కొన్నారు. ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు పాఠశాలల్లో జాతీయ జండా ఎగురవేసే అధికారం కల్పించాలని కవిత కోరారు. అవసరమయితే వారికోసం చట్టసవరణ చేయాలని శాసన మండలిలో విజ్ఞప్తి చేశారు.