తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు బీమాను వ్యవసాయ కూలీలకు వర్తింపజేయాలి: జీవన్ రెడ్డి

రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. శాసన మండలిలో బడ్జెట్​పై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

mlc-jeevan-reddy-said-the-state-government-should-take-steps-to-support-agricultural-laborers
రైతు బీమాను వ్యవసాయ కూలీలకు వర్తింపజేయాలి:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By

Published : Mar 23, 2021, 4:11 AM IST

రైతు బీమా పథకాన్ని వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కోరారు. శాసన మండలిలో బడ్జెట్​పై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల మంది గల్ఫ్‌ కార్మికులు చనిపోయారన్న ఆయన మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్ధులకు గురుకులాలలో 75 శాతం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించి.. ఏకగ్రీవాలు జరిగిన పంచాయతీలకు రూ.10లక్షలు నజరానా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:మరఠ్వాడకు ఇచ్చారు.. మరి కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ ఏమైంది.?: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details