రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోటి ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
ఇప్పటి వరకు పంటనష్టం అంచనా వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలు కేంద్రంతో సంబంధం లేకుండా ఎకరానికి పదివేలు పరిహారం ఇస్తామని ప్రకటించాయని అన్నారు. ఎకరాకు 10 వేలు నష్టం అంచనా వేస్తే 10 వేల కోట్ల పంట దెబ్బతిన్నదని వెల్లడించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వెయ్యి కోట్ల పంట మాత్రమే నష్టపోయినట్లు కేంద్రానికి నివేదిక ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.