తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు టీచర్లకు కనీసం రూ.5 వేలు ఇవ్వాలి: జీవన్‌రెడ్డి

తెలంగాణలో సామాజిక న్యాయానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులున్నాయని అన్నారు.

వారికి కనీసం రూ.5 వేలు ఇవ్వాలి: జీవన్‌రెడ్డి
వారికి కనీసం రూ.5 వేలు ఇవ్వాలి: జీవన్‌రెడ్డి

By

Published : Apr 14, 2021, 2:26 PM IST

తెలంగాణ ఏర్పాటుతో సామాజిక న్యాయం జరుగుతుందని అందరం భావించామని... కానీ దురదృష్టవశాత్తు అందుకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయని.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అందరం భావించినా... ప్రస్తుతం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తలెత్తాయన్నారు.

రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న జీవన్‌రెడ్డి... ప్రైవేటు టీచర్లకు 2వేల రూపాయలు సరిపోవని .. కనీసం 5 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతికి ఇప్పటివరకు అతీగతీ లేదని... ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో వారంతా రోడ్డుపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారికి కనీసం రూ.5 వేలు ఇవ్వాలి: జీవన్‌రెడ్డి

ఇదీ చూడండి:త్వరలోనే హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details