కేసీఆర్... జాతీయ రాజకీయాల వైపు వెళితే కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉండొచ్చునని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ సీఎం అయ్యేందుకు సమర్థుడే అయినప్పటికీ... వారసత్వం అనే ముద్ర ఉందన్నారు. సీఎంగా కేటీఆర్‌కు బదులు ఈటల రాజేందర్‌ను చేస్తే పార్టీలో ఎవరూ వ్యతిరేకించరని జీవన్ రెడ్డి వివరించారు.
నిజంగానే కేసీఆర్... భాజపాకు, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావించి... జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్లదలుచుకుంటే... ఇక్కడ మీరు ప్రత్యామ్నాయం గురించే ఆలోచిస్తే... కేటీఆర్ సమర్థుడే కావొచ్చుగాక. కానీ కేటీఆర్‌కు ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. కేటీఆర్‌పై ఓ విమర్శ ఉంది. ఏంటంటే వారసత్వం. దీనికి తావు ఇవ్వకుండా ఉండాలంటే... ఉద్యమం ఆరంభం నుంచి ఉండి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పిస్తే అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తారనుకుంటున్నా.
--- జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ