తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగుల బెనిఫిట్లను వెంటనే చెల్లించాలి: జీవన్​రెడ్డి - పీఆర్సీ చెల్లించాలని జీవన్​రెడ్డి డిమాండ్​

ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రయోజనాలను వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి డిమాండ్​ చేశారు. పరిహారాలను పదేళ్ల తరువాత చెల్లిస్తామనడం సరికాదన్నారు.

ఉద్యోగుల బెనిఫిట్లను వెంటనే చెల్లించాలి: జీవన్​రెడ్డి
ఉద్యోగుల బెనిఫిట్లను వెంటనే చెల్లించాలి: జీవన్​రెడ్డి

By

Published : Mar 23, 2021, 12:41 PM IST

ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారాలను పదేళ్ల తర్వాత ఇస్తామనడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవాలను గ్రహించాలని.. గడిచిన 33 నెలల బెనిఫిట్స్​ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశంలో 60 ఏళ్లకు పైగా ఉద్యోగుల వయోపరిమితి లేదని గన్​పార్క్ మీడియా పాయింట్ వద్ద తెలిపారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని క్యాలెండర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి అమలు చేయబోతున్నామని కేటీఆర్ రెండు నెలల క్రితం ప్రకటించారన్నారు. నిరుద్యోగులకు భృతి ఇస్తే ప్రభుత్వం దివాళా తీస్తుందా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ రూ.27 లక్షలు వసూలు

ABOUT THE AUTHOR

...view details